స్నేహాన్ని విడిచేవారిపై నిందలెందుకు వేస్తావు !?
ఒకసారి నువ్వే ఆత్మవిమర్శ చేసుకో .... !!
నీ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉందనుకో
ఆరోహణాలే తప్ప అవరోహణాలు ఉండవు కదా !!
ఏదో ఆకర్షణకు లోనై నీ జత చేరినవాళ్ళకు
దూరపు కొండల్లా ఎందుకు మారుతున్నావు ?
నీ భావాలు నీకు అద్భుతంగా అనిపించవచ్చు
విభేదించే వారి వాదనను కూడా గౌరవించు !!
నీ వేదికపై అందరినీ ఆహ్వానిస్తావు బాగుంది ...
ఆహ్వానించే సహృదయత ఆసనమిచ్చేటప్పుడు ఎందుకుండదు !?
తనకంటే తెలివైన వారి సాంగత్యాన్ని చాలామంది ఇష్టపడరు ..
ఆ విషయాన్ని నువ్వు ఆచరణలో చూపిస్తున్నావు !!
నీ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి అనేక పథాలు ఉన్నాయి
ఇతరుల భావనల పట్లకూడా సరైన దృక్పథం పెంచుకో !!
సమతుల్యపు స్నేహ సౌరభావాన్ని వెదజల్లు
ఎవరాపిన ఆగకుండా నీవెంట సమూహం వస్తుంది !
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments