Followers

Monday, May 6, 2013

thumbnail

మర్చిపోకు ... !




ఎవరికి సహాయపడకుండా 
ఎన్నాళ్ళిలా దాచుకుంటావు
మర్చిపోకు శవ్వస్త్రానికి జేబు ఉండదు
సమాధిలో బీరువ ఉండదు !!


అక్రమ సంపాదనకు
ఎన్నో పరీక్షలు ఎదురుకున్నావు
దేవుడి ఎదుట పరీక్షకు
ఎంత సిద్దంగా ఉన్నావో చూసుకో !!


రాబోయే క్షణమేలా ఉంటుందో చూడలేవు
ఏడు తరాల గురించి ఆలోచిస్తావు
నీ పాపాన నువ్ పోక అందరి పాపాన్ని
ఎందుకు మూట కట్టుకు పోతావు !!

తెలుసు కదా నీతో పాటూ 

సర్వంసమాధి అయిన
మంచి , చెడు మాత్రం

బయిటే సజీవంగా ఉంటాయని !!

నీ మంచిని స్మరించే 

ఆసక్తి లోకానికి ఎలాగూ ఉండదు ...
చెడు మాత్రం నీ వారసులపై 

చూపిస్తుంది దుష్ప్రభావాన్ని .... !!
                                     
                                                                   

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.