నా నుదిటిపై
ముంగురులు లాస్యం చేస్తే
మేఘాల్లా అడ్డువస్తున్నవని
చిరుకోప్పడే వాడివి
నువ్వు వదిలే శ్వాస చాలు
పరిమళానికని
పెట్టుకున్న మల్లెల్ని తీసేసెవాడివి....
ఏమైపోయింది
ఇంత యాంత్రికంగా మారుతున్నావు ?
మస్తిష్కాన్ని ఎక్కడో పెట్టి
కేవలం దేహాన్ని మోసుకు వస్తున్నావు
ఎందుకో తెలియదు గాని
నీ చూపుల్లో
నిరాసక్తతను దాచేస్తున్నావు
నీ మాటల్లో
పలకరింత ఉంటుంది
మనసుకు కలిగే
పులకరింత మాత్రం ఉండదు
చూపుల్ని కలపలేక
నన్ను హత్తుకుంటావు
ఐక్యం చేసుకోవాలనే
ఆతృత మాత్రం నీలో ఉండదు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments