నువ్వు అజ్ఞాతంగానే ఉండు నేస్తమా
వాక్యాల వారధి ఉందిగా .. నీ ఉనికితో నాకేం పని
!?
నీ వదనంపై
ఎవరిదైనా ముసుగు వేసుకో
ఆత్మసౌందర్యాన్ని చూస్తాను ..
నీ బాహ్య సౌందర్యంతో నాకేం పని
నా అభిమానంలో
అనుమానాన్ని అన్వేషించకూ
పరిధి అతిక్రమిస్తే కదా
నువ్ అనుమానించాలి
ప్రతివారు చెప్పేది ఇదేగా అనుకుంటే
కనిపించదా నిజం చనువును హద్దుల్లో ఉంచిన
నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే ...
అనుకుంటావేమో
..అభిమానానికి
స్త్రీ అనే కారణం .. కావచ్చుగా !
అదే నిజమని
కాదు కొంత నీలోని భావుకత కూడా ఉండొచ్చుగా . !
అంటావేమో .. దూరం చేస్తే అభిమానం
మర్చిపోవచ్చుగా
ఇప్పుడేం దగ్గరగా ఉన్నామా అనే సందేహం నాకు రావచ్చుగా !
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments