ప్రతిసారి అదృష్టాన్ని నిందించడం భావ్యం కాదు
చాలాసార్లు మనం కూడ హద్దులు దాటి ఆశిస్తుంటాము
ఇతరులకు ఎన్నో నీతులు చెబుతాము
ధూళి వదనంపై పెట్టుకొని అద్దాన్నే తుడుస్తుంటాము
తాహతుకు మించిన ఆడంబరం చూపిస్తాము
కదిలే నీటిలో ప్రతిబింబం చూడాలనుకుంటాము
మనకు లేకున్నా , ఉన్నవాళ్ల చుట్టూ తిరుగాలనుకుంటాము
నది సముద్రంలో కలసి అస్తిత్వాన్ని కోల్పోతుందని మరిచిపోతాము
నేనది , నేనిది అంటూ జనాన్ని బెదిరించాలనుకుంటాము
నిజానికి మానసిక బలహీనతను అలా దాస్తుంటాము
ఒక కవిత భావాత్మకంగా రాయలేము
రాసిన వారిని మాత్రం విమర్శిస్తూ ఉంటాము
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments