నువ్వు
మండుతున్న గోళానివి
నేను
ఘనీభవించిన నీరు ని
నువ్వు
నన్ను ఆవిరి చేస్తావో
నేను
నిన్ను ఆరిపి వేస్తానో ...
చూద్దాం
...
నువ్వు
కఠినమైన రాయివి
నేను
ఎన్నో శిల్పాలను చెక్కిన ఉలిని
నేను
నీకు ఆకృతిని ఇస్తానో
నువ్వు
నా ఆకృతిని విరుస్తావో
చూద్దాం
....
నువ్వు
తాపం పెంచే గ్రీష్మానివి
నేను
చల్లదనాన్ని ఇచ్చే
పవనాన్ని
నువ్వు
నాలో తాపం పెంచుతావో
నేను
నీలో తాపం తగ్గిస్తానో
చూద్దాం ......
నువ్వు
పునాదులను కుదిపేసే తుఫానువి
నేను
ఆత్మ స్థయిర్యంగా నిలబడ్డ కొండ చరియని
నన్ను
శకలాలుగా మారుస్తావో
నన్ను
ఢీ కొని నీ వేగాన్ని తగ్గించుకుంటావో
చూద్దాం......
నువ్వు
గాలి దుమారానివి
నేను
వెలుగుతున్న దీపాన్ని
నన్ను
ఆర్పి వేస్తావో
నా
కాంతిని చూసి నిశ్చలనమైపోతావో
చూద్దాం........
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
1 Comments
"నువ్వు గాలి దుమారానివి
Reply Deleteనేను వెలుగుతున్న దీపాన్ని
నన్ను ఆర్పి వేస్తావో
నా కాంతిని చూసి నిశ్చలనమైపోతావో
చూద్దాం" భలే నచ్చేసిందిది.:-)