వాడు నిప్పు
రగిలించేది
ఎవరి
గురించైన కావచ్చు
చూస్తూ
ఉరుకుంటే
నీ దాకా రాక మానదు .
నిప్పు
ఆర్పడానికి.
కాస్తైన
తోడ్పాటు అందించు .
నీ సహకారం
చూసి
సమూహం రాక మానదు
వాడు
విధ్వంసం సృష్టించి
వినోదం
చూస్తుండవచ్చు
నువ్వు
ఘర్షణల చేసుకుంటే
వాడి ఆశయం
నెరవేరక మానదు
బాధితులెవరైనా సరే
చేయూతను అందించు
నీ మనస్థైర్యం చూసి
వాడికి భయం కలగక మానదు
మాతృభూమి గురించి
వాడికి సందిగ్ధం నూరి పోసి ఉండవచ్చు
అలాంటి వారిని గుర్తించకుంటే
మళ్ళీ ప్రమాదం రాకమానదు
నీ మతం నీకు గొప్పది అయినా ,
పరమత సహనం కాస్త చూపించు
ఎవరి మనసులో చెడు ఉన్న
కొంతైనా పరివర్తన రాకమానదు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments