ఎంత తేలిగ్గా చెబుతున్నావు
ఇంకో పెళ్లి చేసుకుంటా ...
నాకేం తక్కువైందని
నాకేం తక్కువైందని
నీకా ఆలోచన వస్తుంది ? ...అంటే సిగ్గులేకుండా
ఏమంటున్నవూ ?
రోజూ అదే తిండి ..
రోజూ అదే తిండి ..
తినాలనిపించట్లేదు
నీ ఆకలి ఎంతో
నాకు తెలియదా ?.. నీలో ఆకలే సరిగ్గా
ఉండనప్పుడు
ఎవరోచ్చి తినిపించిన
ఏం తినగలవూ ?....
ఆ మాట నేను అనలేకనా ...!?
ఆ మాట నేను అనలేకనా ...!?
నేనింక బాగానే ఉన్నాను ..
నీకు నచ్చినట్లే ఉంటున్నాను అంటే ...
నీలో నాకు కావాల్సింది
నీలో నాకు కావాల్సింది
కనిపించడం లేదు అంటున్నావు
నీ వలన పిల్లల్ని
నీ వలన పిల్లల్ని
కని .. పెంచాను .
ఇంకా వాడిగా వేడిగా
ఎలా కనిపించగలను ...?
నేను సరే !..
మరి నువ్వూ ?
నన్ను గమ్యానికి తీసుకెళ్తూ
నన్ను గమ్యానికి తీసుకెళ్తూ
మార్గంలో అలిసి పడిపోతుంటావు ...
మరి గమ్యానికి చేరుకోవడానికి
మరి గమ్యానికి చేరుకోవడానికి
నేనింకో తోడు వెదుక్కోనా ?
ఆ మాట నేను అనలేకనా !?
ఆ మాట నేను అనలేకనా !?
నీ అదృష్టం ఏదంటే ...
నువ్వు మగాడిగా పుట్టావు
నా నిస్సహాయతనే
నీ అర్హత అనుకుంటావు
సమాజపు కట్టుబాట్లు
నా నోటికి అడ్డుపడకుంటే
ఆ మాట నేను అనలేకనా !?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఈ విషయం ఆ నిస్సహాయపు వ్యక్తికి నిజంగా తెలియదనా!?
Reply Deleteతెలిసిన అనలేక ..
Reply Delete