నీకెలా చెప్పాలి
నేను మారలేదని
నీపట్లా ఏమాత్రం
ఆసక్తి తగ్గలేదని !!
నిజమే మనలో కొంత
అంతరం వచ్చింది
అనుకూలించని సమయం
అగాధాన్ని పెంచింది
నీ పిలుపుకు
ఒక్కోసారి స్పందించను
ఆర్తిగా
నీ నుదుటిని చుంభించను
అంతమాత్రాన
నా సాహచర్యం
ఎక్కడో చౌర్యం అయిపోయిందా ?
బాహ్యంగా దూరం
చేస్తున్నాననే భావం నీది !!
నీ మనసుకు మరింత
చేరువవడానికి చేసే ప్రయత్నం నాది !!
ఒకప్పుడు
నా అందమైన భవిత కోసం
రేయింబవళ్లు నిన్ను స్మరించాను
ఇప్పుడు
నీ ఉజ్వలమైన భవిత కోసం
అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను
యాంత్రికంగా నీకిప్పుడు
కనిపిస్తూ ఉన్న...
నీ పిలుపుకు దూరంలో
ఉంటున్నా ...
నాపై నమ్మకంతో
వచ్చిన నీకు
తప్పు చేసాననే
భావన రాకూడదనే ..... !!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments