నక్షత్రాలను లెక్కపెడుతూ ఉండు మళ్ళీ వస్తానని
నిష్క్రమించే విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పావు
నాది అమాయకత్వమో .. నీమీదా విశ్వాసమో
ఇప్పటి వరకు నీ నిరీక్షణలో ఉంటున్నాను
ఎన్నో వసంతాల ఒంటరితనం తర్వాత
నీ పరిచయం జీవితానికి సరికొత్త భాష్యం చెప్పింది
ఎండుటాకులవలే చెదిరిఉన్న నన్ను
నీ స్నేహం దగ్గరగా ఒక చోటికి చేర్చింది
ఆహ్లాదం .. ఆసక్తి .. స్నేహానుభూతి తప్పా
ఆశించడం .. ఇవ్వడం లాంటి ఏ అంశాలు
మనమధ్య రా ( లే ) కపోవడంతో
నమ్మకమనే వారధిపై నువ్వు నడిచొచ్చేదానివి
మనసు విప్పి మాట్లాడుతావు
ఇంత పారదర్శకంగా ఉండవద్దంటే
నమ్మకం ఉన్నచోట పవిత్రత
పవిత్రత ఉన్నచోటా నమ్మకానికి తప్పా
మరో దానికి చోటు ఉండదులే నవ్వేదానివి
నువ్వలా నవ్వకూ నీ నిష్కల్మషమైన నవ్వు చూసి
ఇక్కడిక నావెన్నెల చల్లదనమేందుకు అని
చంద్రుడు మేఘలా చాటుకు వెళ్ళిపోతాడు ..
నా మాటలకు మరింత నవ్వేదానివి
కానీ ఆ సమయం నాకో విషయం అర్థమే కాలేదు
చంద్రుడు మేఘాల చాటుకు వెళ్లిపోవడం కాదు
మేఘాలు కూడా చంద్రునికి అడ్డుగా వస్తాయని ..
అదొక్కటే కాదు అలాఎన్నో విషయాలు ఇప్పటికీ అర్థం కావు
మనసులో లేచే జ్ణాపకాల హోరులో
ఇప్పటికీ నిశబ్ధంగా అనుకుంటాను
స్థబ్దంగా ఉండే నాలో చలనం కలిగించి
ఎంత నిశబ్ధంగా వెళ్లిపోయావు నేస్తమా ...
నిష్క్రమించే విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పావు
నాది అమాయకత్వమో .. నీమీదా విశ్వాసమో
ఇప్పటి వరకు నీ నిరీక్షణలో ఉంటున్నాను
ఎన్నో వసంతాల ఒంటరితనం తర్వాత
నీ పరిచయం జీవితానికి సరికొత్త భాష్యం చెప్పింది
ఎండుటాకులవలే చెదిరిఉన్న నన్ను
నీ స్నేహం దగ్గరగా ఒక చోటికి చేర్చింది
ఆహ్లాదం .. ఆసక్తి .. స్నేహానుభూతి తప్పా
ఆశించడం .. ఇవ్వడం లాంటి ఏ అంశాలు
మనమధ్య రా ( లే ) కపోవడంతో
నమ్మకమనే వారధిపై నువ్వు నడిచొచ్చేదానివి
మనసు విప్పి మాట్లాడుతావు
ఇంత పారదర్శకంగా ఉండవద్దంటే
నమ్మకం ఉన్నచోట పవిత్రత
పవిత్రత ఉన్నచోటా నమ్మకానికి తప్పా
మరో దానికి చోటు ఉండదులే నవ్వేదానివి
నువ్వలా నవ్వకూ నీ నిష్కల్మషమైన నవ్వు చూసి
ఇక్కడిక నావెన్నెల చల్లదనమేందుకు అని
చంద్రుడు మేఘలా చాటుకు వెళ్ళిపోతాడు ..
నా మాటలకు మరింత నవ్వేదానివి
కానీ ఆ సమయం నాకో విషయం అర్థమే కాలేదు
చంద్రుడు మేఘాల చాటుకు వెళ్లిపోవడం కాదు
మేఘాలు కూడా చంద్రునికి అడ్డుగా వస్తాయని ..
అదొక్కటే కాదు అలాఎన్నో విషయాలు ఇప్పటికీ అర్థం కావు
మనసులో లేచే జ్ణాపకాల హోరులో
ఇప్పటికీ నిశబ్ధంగా అనుకుంటాను
స్థబ్దంగా ఉండే నాలో చలనం కలిగించి
ఎంత నిశబ్ధంగా వెళ్లిపోయావు నేస్తమా ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
3 Comments
ఎక్కడికీ వెళ్ళిపోలేదు మీ జ్ఞాపకాల్లో తనెప్పుడూ పదిలమే.
Reply Deleteపద్మార్పిత గారు ధన్యవాదాలు ... వెంట ఉండేవి జ్ఞాపకాలే కదా .. అవి మాత్రం నిష్కర్షగా ఎవరిని వదిలెయ్యవు ....
Reply Deleteఆజ్ మ ఈ కవితన దేక్రోతో ఆంకిభరన్ ఆఁసూ ఆరేచ..
Reply Deleteసవారేతి కుఁ రచకో కాఁయికో కేన్.. 05 డి 2015..