రెండు విషయాలు తరుచుగా జ్ఞాపకం వస్తాయి
నీ అందెల సవ్వడి .. నీ మాటల ఒరవడి
రెండు విషయాలతో ఎప్పుడూ భయపడ్తాను
నీ వేదనతో .. నీ నిష్క్రమణతో
రెండు విషయాల కోసం ఎప్పుడూ సమయాన్ని వెచ్చిస్తాను
నీ నిరీక్షణలో .. నీకోసం చేసే ప్రార్థనలో
రెండు విషయాలపై నాకు హక్కు ఉందనుకుంటాను
తనివితీరా చూసే నీ వదనంలో .. నీ కోసం చూసే స్వప్నంలో
రెండు సందర్భాల్లో శ్వాస ఆగినట్టవుతుంది
నా చెంతకు వస్తున్నప్పుడు .. నన్ను వీడిపోతున్నప్పుడు
రెండు విషయాలు లేకుండా నేను ఉండలేను
నాపై నువ్వు చూపే అభిమానం .. నాపై ఉంచే నమ్మకం

రెండు విషయాల
కోసం ఏదైనా చేయగలను
నీ చిరునవ్వు కోసం ...అది చూసి వచ్చే నా చిరునవ్వు కోసం ..
నీ చిరునవ్వు కోసం ...అది చూసి వచ్చే నా చిరునవ్వు కోసం ..
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఇంక ఏం మిగిలుందని సర్వం ఆమె అని తెలిసాక.
Reply Deleteమీ భావవీచికలు మనసు గాయాలకి లేపనాలు.
పద్మార్పిత గారు ధన్యవాదాలు మీ అందమైన వ్యాఖ్యకు ...
Reply Delete