నీ గురించి ఆలోచిస్తే
ఒక్కోసారి మందహాసం వస్తుంది
ఒక్కోసారి మనసు ఆర్ద్రమవుతుంది
నీకు నాకు మధ్య ఏది లేదని
ఏది ఉండబోదని తెలుసు
అయిన అర్థమే కాదు ఎందుకాలోచిస్తానో ....
స్పష్టంగా ఏది లేకపోయిన
అదృశ్యంగా ఏదో ఉందనే
అనుభూతి వల్లనేమో ....
ఏ వ్యాపకం లేనప్పుడు
నువ్వు జ్ఞాపకం వస్తే
అంతగా స్పందించే అవసరం రాదు
వ్యాపకాలను నెట్టేసి
నువ్వు జ్ఞాపకం వస్తావు చూడు
అక్కడే ఏదో కోల్పోయిన ..
ఏదో కావాలన్న .. సంధిగ్దత
ఎన్నోసార్లు నీ వాక్యాలు గుర్తుకొస్తాయి
భరించలేని వేదన చుట్టిముట్టినప్పుడు
నాలోంచి నేను వెళ్ళడంతప్ప ....
నిజమే ..కానీ
వేదనకు కారణం నువ్వే అయినపుడు
అలా ఎక్కడికని వెళ్లనూ ...
నువ్వులేని ప్రదేశమంటూ ఏది లేదుగా ..
ఇంతగా ప్రభావం చూపావు అంటే
ప్రతి దృశ్యంలో అదృశ్యంగా
నువ్వే ఉంటావు ..
అస్థిరమైన నామనసు ఎలా ఉంటుందో చూడు
నువ్వెక్కడో అవతలి తీరానా ఉంటావు
నీ వైపు నుండి వచ్చే కెరటాలను
గాలి తిమ్మెరలను
నేటికీ అడుగుతూనే ఉంటాను
తను ఎలా ఉందని ........
ఒక్కోసారి మందహాసం వస్తుంది
ఒక్కోసారి మనసు ఆర్ద్రమవుతుంది
నీకు నాకు మధ్య ఏది లేదని
ఏది ఉండబోదని తెలుసు
అయిన అర్థమే కాదు ఎందుకాలోచిస్తానో ....
స్పష్టంగా ఏది లేకపోయిన
అదృశ్యంగా ఏదో ఉందనే
అనుభూతి వల్లనేమో ....
ఏ వ్యాపకం లేనప్పుడు
నువ్వు జ్ఞాపకం వస్తే
అంతగా స్పందించే అవసరం రాదు
వ్యాపకాలను నెట్టేసి
నువ్వు జ్ఞాపకం వస్తావు చూడు
అక్కడే ఏదో కోల్పోయిన ..
ఏదో కావాలన్న .. సంధిగ్దత
ఎన్నోసార్లు నీ వాక్యాలు గుర్తుకొస్తాయి
భరించలేని వేదన చుట్టిముట్టినప్పుడు
నాలోంచి నేను వెళ్ళడంతప్ప ....
నిజమే ..కానీ
వేదనకు కారణం నువ్వే అయినపుడు
అలా ఎక్కడికని వెళ్లనూ ...
నువ్వులేని ప్రదేశమంటూ ఏది లేదుగా ..
ఇంతగా ప్రభావం చూపావు అంటే
ప్రతి దృశ్యంలో అదృశ్యంగా
నువ్వే ఉంటావు ..
అస్థిరమైన నామనసు ఎలా ఉంటుందో చూడు
నువ్వెక్కడో అవతలి తీరానా ఉంటావు
నీ వైపు నుండి వచ్చే కెరటాలను
గాలి తిమ్మెరలను
నేటికీ అడుగుతూనే ఉంటాను
తను ఎలా ఉందని ........
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments