వర్షం హోరుగా కురిసే సమయాల్లో
బాల్కనీలో కూర్చోని నిర్మానుష్యంగా
కనిపించే రోడ్డును చూస్తుంటే
ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది
వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తూ
తనలో పడుతున్న నీటి బిందువుల్ని
కలుపుకుంటు మరింత ఉత్సాహాన్ని పుంజుకొని
వేగాన్ని సంతరించుకుంటూ పోతూ ఉంటుంది
అప్పుడప్పుడు వెళ్ళే వాహనాలు
దానిని చీల్చి వేగాన్ని తగ్గించాలని చూసినా
అపోహాలు తొలిగిన స్నేహితుల్లా మళ్ళీ కలుసుకుంటూ
ప్రవహిస్తూనే ఉంటుంది
పరిసరాల్లో ఎన్ని ధ్వనులున్నా
మనసు వర్షపు శబ్ధంలో శ్రావ్యతను
వెదుకుతూ ఆహ్లాదంగా మారుతున్నప్పుడు
అకస్మాత్తుగా నీ మాటలు గుర్తుకొస్తాయి
" నువ్వు ఎదురుగా ఉంటేనే కాదు
స్పందించే మనసు ఉంటే ..
ప్రకృతిలోని ఏ చిన్న అంశమైన
మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది
నువ్వుండక పోవచ్చు అనుక్షణం.
ఆ శూన్యాన్ని నింపుకోవడానికి
నీ జ్ఞాపకమో.. ఏ వ్యాపకామో
అందుబాటులో ఉన్న ఏ చిన్న అంశమో
ఆహ్లాదాన్ని ఇచ్చేలా మల్చుకోవాలి కదా ..."
బాల్కనీలో కూర్చోని నిర్మానుష్యంగా
కనిపించే రోడ్డును చూస్తుంటే
ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది
వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తూ
తనలో పడుతున్న నీటి బిందువుల్ని
కలుపుకుంటు మరింత ఉత్సాహాన్ని పుంజుకొని
వేగాన్ని సంతరించుకుంటూ పోతూ ఉంటుంది
అప్పుడప్పుడు వెళ్ళే వాహనాలు
దానిని చీల్చి వేగాన్ని తగ్గించాలని చూసినా
అపోహాలు తొలిగిన స్నేహితుల్లా మళ్ళీ కలుసుకుంటూ
ప్రవహిస్తూనే ఉంటుంది
పరిసరాల్లో ఎన్ని ధ్వనులున్నా
మనసు వర్షపు శబ్ధంలో శ్రావ్యతను
వెదుకుతూ ఆహ్లాదంగా మారుతున్నప్పుడు
అకస్మాత్తుగా నీ మాటలు గుర్తుకొస్తాయి
" నువ్వు ఎదురుగా ఉంటేనే కాదు
స్పందించే మనసు ఉంటే ..
ప్రకృతిలోని ఏ చిన్న అంశమైన
మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది
నువ్వుండక పోవచ్చు అనుక్షణం.
ఆ శూన్యాన్ని నింపుకోవడానికి
నీ జ్ఞాపకమో.. ఏ వ్యాపకామో
అందుబాటులో ఉన్న ఏ చిన్న అంశమో
ఆహ్లాదాన్ని ఇచ్చేలా మల్చుకోవాలి కదా ..."
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
Good one.
Reply DeletePadmarpita ji thanks ...
Reply Delete