నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితం శిశిరమైపోదు
ఏ ఒక్క ఆకు అసంతృప్తిగా రాలవద్దనే
ఆత్మీయతత్వం నాది
నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా స్నేహ సంపదేమీ తరిగిపోదు
ఏ ఒక్కరినీ దూరం చేసుకోవద్దనే
పిసినారితత్వం నాది
నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితం చీకటిమయమైపోదు
ఏ ఒక్క నక్షత్రం అర్దాంతరంగా రాలకూడదనే
ఆర్దత్వం నాది
నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితంలో ప్రళయమేమి రాదు
అయినా నిన్నుఅభ్యర్థించి ఆపాలనే
స్నేహతత్వం నాది
నువ్వొక్కదానివి వెళ్లిపోతే
అందరు పోతారనే భయమేమి కాదు
ఎవరెళ్లి పోయినా నువ్వు మిగిలితే చాలనుకొనే
అమాయకత్వం నాది
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
బక్రీద్ శుభాకాంక్షలు Ali garu from Srimodugu
Reply Deleteమీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి
Reply Delete