ఎంతో కాలం తర్వాత
మాతృదేశానికి వచ్చినపుడు
కళ్ళు నేలను ముద్దాడుతాయి
ఎందుకనేది చెప్పలేము
నేలపై కూర్చున్నప్పుడు
చేతి వేలు ఏదేదో రాసేస్తుంటుంది ..
ఎందుకనేది చెప్పలేము
అపరిచితురాలైన సరే చిన్నారులతో
చూపులు కలిసినపుడు కళ్ళతోనే ఏదో చెబుతాం
ఎందుకనేది చెప్పలేము
నిర్మానుష్యమైన దారిలో నడుస్తున్నప్పుడు
కాలితో చిన్న చిన్న రాళ్ళను కొట్టుకుంటూ వెళ్తాము
ఎందుకనేది చెప్పలేము
కొందరితో చూపులు కలిసి
వాళ్ళను దాటాక కూడా మందహిస్తూనే ఉంటాము
ఎందుకనేది చెప్పలేము
వర్షం పడే సమయంలో ఒంటరిగా ఉంటే
దోసిలి పడ్తాము
ఎందుకనేది చెప్పలేము
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
తనని దారుణంగా హింసిస్తున్న
Reply Deleteఅన్ని తానై ప్రకృతి పలకరిస్తుంది
ఎందుకనేది చెప్పగలరా
తనను భవిష్యత్తులో ఎలా చూసుకుంటాడో
అని సంకోచం మదిలో దాగి ఉన్నా మనకోసం తానె అమ్మ తరువాత అమ్మ లా లాలిస్తుంది ఎందుకనేది చెప్పగలరా
చిన్నపటినుండి మనకు తెలిసిన గుండె
ఈ రోజు కొత్తగా రాగాలు తీస్తుంటే కలిగే ఆ హాయిని ఊహించలేము
ఎందుకనేది చెప్పగలరా
Kavitalu ayite sunayaasangaa raayaganu ...kaani meela comment lu raayalenu..ఎందుకనేది చెప్పగలరా..?
Reply Delete