నువ్విలా ఉంటావు ...
నిశీది వలవలు ఒక్కొట్టిగా జారవేస్తుంటే
అస్పష్టంగా బహిర్గతమయ్యే తొలి సంధ్యలా ....
తొలి సంధ్యలో వినిపించే పక్షుల
కిలకిలా రవాల శ్రావ్యతలా ....
గోధూళి వేళ అమాయకంగా గంతులు వేస్తూ
తల్లిని అనుసరించే లేగ దూడలా .....
గ్రీష్మం తర్వాత కురిసి ఆహ్లాదాన్ని
ఇచ్చే మొదటి వర్షపు చినుకులా ....
వర్షం వెలిసాక నీటి బిందువుపై పడి
విశ్లేషం చెందే కిరణంలా ....
వర్షం కురుస్తున్నప్పుడు కూడ
అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే నులి ఎండలా .....
తొలి సంగమానికి సంసిద్ధమయ్యే
నవ వధువు మస్తిష్కంలా ...
అధరాల తొలి కలయికలో
వెన్నులోంచి వచ్చే జలధరింఫులా ...
పాల్ఘున మాసపు చలిలో చెలికాడి
వడి నిచ్చే నులివెచ్చని అనుభూతిలా ...
ప్రసవ వేదన మరిచి తొలి సంతానాన్ని
చూసే మాతృ హృదయంలా ....
తొలిసారిగా పాఠశాలకు వెళ్తూ వెనక్కి తిరిగి
తల్లిని చూసే పసివాడి బేలా చూపులా ....
గోరింటా పండిన చేతులను
చూసుకొని మురిసే పసిపాపలా ...
వసంతాల అనంతరం మాతృ భూమిపై అడుగిడినపుడు
కలిగే అనిర్వచనీయంగా కలిగే ఆనందం లా .......
**** నిజానికి ఒకప్పుడు ఇది ఎందుకు రాసానో చెప్పలేను .. కానీ మిమ్మల్ని
చూడక ముందు .. మీతో మాట్లాడక ముందు ఇది రాసాను . మీతో కలసి ఇంటికి వచ్చాక మళ్ళీ దీన్ని
చూశాను .. నేను ఎలా రాసానో మీరు అలాగే ఉన్నారు ... మీ ఫోటో చూసాక ఎందుకో దీన్ని మళ్ళీ
పోస్ట్ చేయాలనిపించింది ... మీ అందాన్ని నిర్వచించడమే తప్ప మరో దురుద్దేశం తో మాత్రం
కాదు సుమా ... క్షమాపణలతో .... *****
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments