Followers

Monday, September 16, 2013

thumbnail

ఎవరు గుర్తించుకుంటారు ?





నువ్వెవరినైతే మర్చిపోతావో

అతన్ని ఎవరు గుర్తించుకుంటారు ?

ఎవరికైతే నువ్వు జ్ఞాపకం ఉంటావో

అతను మరొకరినెలా గుర్తించుకుంటాడు ?


**** **** **** **** ****

నీ ప్రేమ అదృష్టం లాంటిది

నిన్ను ఇవ్వచ్చు .. ఇవ్వకపోవచ్చు

కానీ , నువ్వు ఒకప్పటి నేస్తానివనే

భావన మాత్రం స్వాంతన ఇస్తుంది


**** **** **** **** ****

నా జీవితంలో కేవలం రెండే విషయాలు

అసంభవంగా కనిపిస్తాయి

నిన్ను పొందగలిగే అభిలాష .. మరవగలిగే ఆశ


**** **** **** **** ****

మృత్యువు కేవలం

పేరుతోనే భయపెడ్తుంది

నిజానికి నీ ధ్వేశమే

దానికన్న ఎక్కువగా హింసిస్తుంది 


**** **** **** **** ****

నీ శరీరమే కావాల్సి ఉంటే

నిన్నెలాగో పొందే శక్తి నాలో ఉంది

కానీ దేవుణ్ణే ఎందుకు ప్రార్థిస్తున్నానంటే

నీ ఆత్మపై ఆధిక్యత కావాలి


**** **** **** **** ****

కన్నీరు ప్రపంచంలో

అన్నిటికంటే విలువైనది

కానీ దాని విలువ ఎవరు గుర్తించరు
..
ఎప్పటివరకైతే తమ కంటి నుండి కారదో ....!!



Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

2 Comments

avatar

మెహ్ది అలీ సాహెబ్, కవితంట ఆసక్తిదాయకంగా సాగింది. చిన్న పొరపాటు (టైపో ఎర్రర్ ) దొర్లింది. అది "స్వాంతన" కాదు "సాంత్వన".

కరిగే కన్నీటి విలువ
కంటి పాప కలల విలువ
లోకంబెల్ల రంగులలోకాన్నందించే కన్నులకేలా ఈ నలుపు తెలుపు వర్ణాల కలయిక

కరిగే మైనం కరగక మానదు
అది కరిగే లోగ తన యదలో దాగిన దారాన్ని ఆవహిస్తున్న నిప్పుని చూసి కన్నీరులా కరిగిపోయి గట్టిపడుతుంది
అది కరిగిపోయే లోగా లోకాన్ని చీకటి చెరనుండి విముక్తిని చేస్తుంది
Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/

Reply Delete
avatar

thanks sridhar garu..wah..mee comment chadavagaane ila vachhestundi...thank you

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.