Followers

Tuesday, September 10, 2013

thumbnail

!! వాళ్ళల్లో ఒకరిగా .... !!




తెల్లారింది .. రోజులాగే ..
కనులు లోకాన్ని చూడకముందే 
మనసు నిన్ను చూసేసింది
రోజు జరిగేదదేగా ..
నిన్నటి వరకు నీ ఆలోచన
మందహసాన్ని రప్పించేది .
ఈ రోజెందుకో అది రాలేకపోయింది ..
ఇక వస్తుందనే నమ్మకం కూడ లేదు .
లేవాలనిపించలేదు . లేచి ఏంచేయాలో అర్థం కాలేదు .
అదే ఇల్లు ,అదే రహదారి , అదే కృత్రిమ చిర్నవ్వు ....
అయిన లేవకతప్పదు ..
మరొకరి వ్యామోహంలో దూరం అయింది నువ్వు ..కానీ
కొందరు ఆప్తులు కాదుగా ..
ప్రస్తుతం నా జీవితం తడిసిన కాగితంలా ఉండి
వ్రాయడానికే కాదు .. కాల్చడానికి కూడా పనికి రాకపోవచ్చు
ఒప్పుకుంటాను .. కానీ
ఏదో రోజు అది ఆరి రాయడానికి మళ్ళీ ప్రేరేపిస్తుంది ..
అప్పుడు చూద్దాము నా మనసులోని భావాలు ఎలా ఉంటాయో ,
నీలాంటి ప్రేరణ ఎవరిస్తారో ...
ఎవరు లేక అప్పటికి నువ్వే ఉంటే ..
అప్పటికే మరొకరి భార్యగా ఉండే నీ గురించే అవి ఉంటే ...
నైతికంగా దిగజారే నన్ను నేను క్షమించుకుంటాను
ఎందుకంటే ..
బాహువుల్లో ఒకరిని , భావాల్లో మరొకరిని తలుస్తూ
మానసిక వ్యభిచారం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ?

నేను కూడా ఉంటాను వాళ్ళల్లో ఒకరిగా ....
  



Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

8 Comments

avatar

తనేప్పుడో మర్చిపోయుంటుంది
తనకోసం నువ్వు అల్లిన బొమ్మరిల్లుని

తనేప్పుడో మరిచిపోయుంటుంది
తన కోసం ఆరాధించిన నీ మనసుని

తనేప్పుడో మరిచిపోయుంటుంది
తన ఆలోచనల ఊపిరిలో వాయువు నువ్వన్న సంగతిని

మేహిది గారు.. కవిత ఆద్యంతము బాగుంది. కల్పనాత్మకంగా ఉంది

Reply Delete
avatar

కనులు లోకాన్ని చూడకముందే మనసు నిన్ను చూసేసింది

ప్రస్తుతం నా జీవితం తడిసిన కాగితంలా ఉండి వ్రాయడానికే కాదు .. కాల్చడానికి కూడా పనికి రాకపోవచ్చు

బాహువుల్లో ఒకరిని , భావాల్లో మరొకరిని తలుస్తూ
మానసిక వ్యభిచారం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ? ....... చాలా సున్నితమైన భావాలు కానీ అంతర్లీనంగా ఎంతో గంభీరత ఉంది.. ..
నిజానికి మీరు రాసేవి కవితల్లాగా ఉండవు కానీ ..మనసుకు ఏదో తెలియని హాయిని ఇస్తాయి .. దాని కోసమే .. మీకు రాయండి అని అభ్యర్తించేది ... ఒక చిన్న సలహా ..ఒకరి కోసం మీ కలాన్ని ఎప్పుడు అపకండి .. క్షమించాలి ...


Reply Delete
avatar

థాంక్స్ శ్రీధర్ గారు ..

తనేప్పుడో మర్చిపోయుంటుంది ..

అంత సులభంగా మర్చిపోయే స్నేహం కాదు మాది

తనకోసం నువ్వు అల్లిన బొమ్మరిల్లుని
తను కుటీరంలో ఉండలేదు ..తనకు మేడలు కావాలి

తనేప్పుడో మరిచిపోయుంటుంది
తన కోసం ఆరాధించిన నీ మనసుని
తను ఎన్ని మనసులను జ్ఞాపకం ఉంచుకుంటుంది పాపం ..

తనేప్పుడో మరిచిపోయుంటుంది
తన ఆలోచనల ఊపిరిలో వాయువు నువ్వన్న సంగతిని

కలుషిత ( మత ) మైన వాయువును కదా ..

Reply Delete
avatar

ఆకృతి థాంక్స్ .... నేను మీకు చెప్పింది మనసు బాగాలేదు అందుకే రాయడం లేదు ..అంతే గాని ఒకరి గురించి అని అనలేదు .. ఆ ఒకరు ఎవరున్నారని .. ? అలాంటిది ఏది లేదు .. నిజంగా ... వృత్తిపరమైన ఒత్తిడి వలన రాయలేకపోతున్నాను అంతే .......
అయిన నేను రాసేవి కవితల్లాగా ఉండవుగా .... thanks yaar

Reply Delete
avatar

అవును అలీ గారు ... కలుషితం అయ్యింది మా /నా ప్రేమ ఐతే కాదు. మీ ఎనాలిసిస్ బాగుందండి. షుక్రియ

Reply Delete
avatar

బాగుందండి మీ భావాల ఝరి.

Reply Delete
avatar

shukria....

aap ko achanak yahan dekh kar mera sar shrmindagi se jhuk gaya..
aur kitna sharminda karoogi..mujh jaise be iman insan ko....
.

Reply Delete
avatar

mee preme kaadu evari prema kuda kalushitam kaakudadani naa abhilaasha.....thanks...

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.