అనువణువు తెలిసి ఉండి
అపరిచితులై ఉన్నాము
ఎలా ఉండేవాళ్లం
ఎలా అయిపోయాము ?
నువ్వు నన్ను వీడావా
నేను నిన్ను వీడానా
ఎవరు చెప్పలేకపోయిన
ఒక అస్పష్టమైన చిత్రంలా మిగిలాము
స్పష్టత ఇవ్వగలిగిన క్షమత నీలో ఉన్న
నీ అహం నిన్ను అడ్డుకుంటుంది
స్పష్టతను ఆడగ గలిగిన అర్హత నాలో లేక
సంకోచం నా హద్దు చూపుతుంటుంది
నిన్ను కోల్పోయాక
నన్ను నేను కోల్పోయానో
నేను లేని నిన్ను చూస్తూ
ఒక అందమైన భవిష్యత్తును
కోల్పోయానో అర్థమవడమే లేదు
ఇప్పుడు ఎలా అనుకున్న
తిరిగిరాని క్షణంలా నువ్వు రాలేవు
గగనాన విహరించే నిన్ను
అవనిపై నేను ఆహ్వానించలేను
నిన్ను చేరుకోవాలని
ప్రయత్నిస్తానేమో గాని
నా స్థాయికి నిన్ను
ఏనాడు తగ్గించాలనుకోను
ఎందుకంటే .. నేస్తమా !
నీరీక్షణలో సహనాన్ని
దుఖ్హంలో ఆనందాన్ని
చిరాకులో చిరునవ్వుని
బాధలో అనునయాన్ని
ఒంటరితనం బాధించకుండా జ్ఞాపకాన్ని
అలా ఎన్నో అంశాలు నేర్పి వెళ్లావు
అవసరం రాదనుకున్నావో
అవసరం రావాలి అనుకున్నావో
తెలియదు గాని నేర్పించలేనిది ఒకటే ...
మర్చిపోవడం ఎలా అని .....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
6 Comments
నువ్వు నేర్పిన వాత్సల్యానురాగం ఇంకా అలాగే ఉన్నాయి
Reply Deleteనువ్వప్పుడే నన్ను మరిచిపోయావు ఎందుకలాగా
నీ తలపులు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి
నువ్వప్పుడే నన్ను మరిచిపోయావు ఎందుకలాగా
నీ తియ్యని మాటలు ఇంకా నా చెవులలో మారుమ్రోగుతూనే ఉన్నాయి
నువ్వప్పుడే నన్ను మరిచిపోయావు ఎందుకలాగా
నీతో నడిచిన ఆ అడుగులు ఇంకా కాలగర్భం లో అలాగే ఉన్నాయి
నువ్వప్పుడే నన్ను మరిచిపోయావు ఎందుకలాగా
మెహ్ది అలీ గారు,
Reply Deleteఈ కవిత నా నన్ను నా గతాన్ని నా ముందు మరల ఆవిష్కరించింది. నన్నే నేను చూసుకునే దర్పణం లా ఉంది అనడం లో అతిశయోక్తి లేనేలేదు.
ఆ బాధనంత మళ్ళి ఇన్నేళ్ళకి మీ కవితలో చూసాను.
గుండె పగిలేలా ఏడవాలనిపించింది. ఎందుకంటే ఇలాటి ఘట్టమే మా జీవితం లో ఓ భాగమయ్యింది చాన్నాళ క్రితం.
మీ కావ్య చిత్రం లా ఒడ్డున మా అడుగుజాడలు చేరగానే లేదు, ఇప్పటికి ఆ రోజులు నాకు గురుతే. శ్రీధర్ భుక్య
http://kaavyaanjali.blogspot.in/
Bukya Sridhar garu ... మరిచిపోవడం ఆమె స్వభావం కనుక ...
Reply Deleteమీరు బాగ రాస్తారు
నిన్ను కోల్పోయాక
Reply Deleteనన్ను నేను కోల్పోయానో
నేను లేని నిన్ను చూస్తూ
ఒక అందమైన భవిష్యత్తును
కోల్పోయానో అర్థమవడమే లేదు
heart touching lines sir.
Thank you Aniketh garu..Mee bhaavaatmakata mansu ku..
Reply Deleteప్రతి మనసు వెనుక ( నిజంగా మనసు కనుక ఉంటే ) అందమైనదో , విషాదమైనదో ఒక గతం ఉంటుంది . ఆ గత జ్ఞాపాకాలకు సంబంధించిన ఏ ఒక్క అంశమైన ఏదేని కవితలో , వాక్యంలో కనిపించినపుడు అసంకల్పితంగా మనసు ఆర్ద్రమవుతుంది .. మీరు , నేను , మరొకరు ..దీనికి అతీతులేము కాము కదా ...కనీసం మీ ప్రేమ అయినా నెరవేరాలని ......
Reply Delete