Followers

Tuesday, September 17, 2013

thumbnail

!!ఆలోచించూ ... ..!!

కవిగా ఒక పేరు 
నలుగురు ఆప్తుల్ని 
సంపాదించుకున్నావు కదా 

ఇక చాలు ..ఎలాగైనా రాయి
ఒక వాక్యం రాయి ..
ఎక్కువనిపిస్తే ఒక పదమే రాయి

నీకెంత పేరుందంటే
నీ ఒక్కో అక్షరాన్ని
కొన్ని లైకులు , కొన్ని ఆహా ..ఓహో లిచ్చి
చదివే అభిమానులకు కొరతలేదు

ఏదో చంద్రుని బొమ్మ వేస్తావు
ప్రేయసి హృదయం అంటావు
ఆకులు ఎండటాన్ని ..రాలడాన్ని రాస్తావు
నా జీవితం శిశిరమంటావు

రక్తంతో గడ్డిని తడుపుతాను .. నీ పాదాలకు గుచ్చుకోకుండా
రాస్తావు ..భావుకత అంటావు
నీ వృత్తి పరమైన అంశం రాస్తావు
పదాలు అర్థం కావడం లేదంటే నాలెడ్జ్ లేదంటావు

ఇప్పుడు నీకింత మార్కెట్ ఉందంటే
నువ్వేది రాసిన నడుస్తుంది ..
కాదు పరుగెత్తుతుంది
ఇప్పుడు నీకు సామాజిక అంశాల గురించి ఏమవసరం ?

మత ప్రాంతాల ఘర్షణల గురించి
భూటకపు ఎంకౌంటర్ల గురించి
సామాజిక రుగ్మతల గురించి
నిరక్షరాస్యత గురించి ... మూఢ నమ్మకాల గురించి
చైతన్య పర్చడానికి రాయడం
ఇప్పుడు అవసరం లేదేమో ...
.
నీకు జై ..జై అన్న వాళ్లే ఉండి
ఇక ఆపేయ్ అన్న వాళ్ళు లేనంత కాలం
పేజీ ఫ్రీ కదా అని నువ్వు ఎలాంటిది రాసిన
నాకు లైక్ కొడుతున్నాడు కదా
అని కొందరు పట్టించుకొనంత కాలం
నువ్వు సమాజం గురించి పట్టించుకోవు

నీలో అంతర్లీనంగా ఎంతో శక్తి ఉంది ..
నీ ఒక్కో అక్షరంతో అందరిలో కాకపోయిన
కొంత మందిలో కాస్తైన చైతన్యం తెగలవూ
ఆలోచించూ ... ఆ దిశలో కలాన్ని సంధించూ .... 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

8 Comments

avatar

hi Mehdi sir...okkasariga trend marchesaare...prema . prnayam nundi okka saariga samaajam paiki vachhesare.....kaani nijangaa chaala bagundi..prastuta paristhitiki darpanam padutu undi...nenu munde cheppaanu kada...meeru denni touch chesina...wow....
* Mahita //

Reply Delete
avatar

నా రిప్లై చూసినపుడు ముందు థాంక్స్ చెప్పాలి .. ఎందుకంటే ..మీ ఫోన్ మెసేజ్ రాగానే ఎంతో బిజీ ఉండి కూడా బ్లాగ్ కు వచ్చి రిప్లై ఇస్తున్నాను ... నేనేం ఒక్కసారిగా ట్రెండ్మార్చలేదు .. నేను నా కిష్టమైన అన్నీ అంశాల్లో రాశాను .. సమాజం , జిహాద్ , సిగ్రేట్ , ప్రకృతి, ..అలా ఎన్నో రాసాను .. కాపోతే ప్రేమ , విరహం , ఉక్రోషం ..నిందలాంటివి కాస్త ఎక్కువే రాసాను .. ఇక వాటి జోలికి సాధ్యమైనంత వరకు వెళ్లకూడదని ... ఇలా రాసాను .. అది కూడా ఇంకొన్నాల్లే ... మీ అభిమానానికి ధన్యవాదాలు ..

Reply Delete
avatar

నా రిప్లై చూసినపుడు ముందు థాంక్స్ చెప్పాలి .. ఎందుకంటే ..nenu lunch ku vellaka malli mee blog ku vachhanu...thanks..meeru dubai vellaka mundu naato kalavandi...subjuct mail chestaanu...thanks naapai gaurvam to reply ichhinanduku...

Reply Delete
avatar

aapne apni sari kavitaon ko is kavita me yaad kiya.."bahot khoob",, agr ye sirf ek kavita hai tho theek hai, par agar sach me raasta badalne ka irada hai, tho apne mujhe maayus kiya ,, samaj k bare me likhne wale tho bahot log hain aur shayad ye itna mushqil bhi nahin, jane kyun mujhe lagta hai apki manjil ka rasta ye nahin... sorry ..maf keejiyega agar galat laga ho tho..

Reply Delete
avatar

Han ye hqeeqat hi..ye kavita my apne aap par likha..ab kya mohabbat ki baten likhun..jitna sara tha sab likh diya..ab na mujhe koi aarzoo hai..na koi dilchaspi...mujhe koi manzil hi nahi chahiye to my raaste ke baare me kya sonchu...? in halat me aap mere rahenma ho my aap ko kaise mayoos karunga..? naya kuch likhungaa nahi ..ab tak post na kiye huve kai kavita mere dairy me hai...aap k ..khatir wo yahan nahi mere wall par post karungaa padhyegaa...

Reply Delete
avatar

Mahita ..mimmalni ala cheyamani ne cheppaledu ..ayina sorry..inka nirnayinchukoledu..velite matram tappakunda call chestaanu..

Reply Delete
avatar

దుబాయ్ వెళ్తున్నారా .. వెళ్లి రండి. హ్యాపీ జర్నీ , బాన్ వోయాజ్. EK525 ఎక్కుతున్నారా లేకా కతార్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కుతున్నారా. మీ ఆరోగ్యం జాగ్రత మెహ్ది గారు. మీకు ఇష్టమని ఉర్దూ రాకపోయినా translator use చేసి ఉర్దూ లో కామెంట్ పెట్టాను. :-)

مہدی صاحب کا شکریہ ادا کیا گوگل ترجمہ کا استعمال کرتے ہوئے اردو میں ترجمہ شریدر

Reply Delete
avatar

shukria...shukria..shayad ye last reply....3 month k baad phir aap se mulakhaat hogi...tab tak k liye alwida dost....

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.