ఒకానొక సందర్భంలో మద్యం నాతో అన్నది ...
అమాయకుడివో , అసమర్థుడివోగాని నిన్ను చూస్తే జాలేస్తుంది
నా ఇంత సమీపానికి వస్తావు .. నన్ను సేవించే వాళ్ళతో కూర్చుంటావు
నా రుచి చూడాలని ఒక్కసారి కూడ నీకు అనిపించదా ?
సంకోచిస్తుంటావో , సిగ్గు పడ్తుంటావో నాకు తెలియదు కానీ ,
ఒక్కసారి నా రుచి చూడు . ....
చేదుగా అనిపిస్తానేమోగానీ నాలొ ఎన్నో సుగుణాలు ఉన్నాయి ...
నిద్రలేమి వాళ్ళకు నిద్రను రప్పిస్తాను
నిస్ప్రుహలో ఉన్నవాళ్ళకు ఉత్తేజాన్ని ఇస్తాను
దుఖ్హంలో ఉన్నవాళ్ళకు దుఖ్హాన్ని తగ్గిస్తాను
ఆనందంలో ఉన్నవాళ్ళకు మరింత ఆనందాన్ని ఇస్తాను
బిడియంగా ఉండేవాళ్ళకు నలుగురిలో మాట్లాడగలిగే ధైర్యాన్ని ఇస్తాను
పిరికి భర్తకు భార్యతో వాదించగలిగే శక్తిని ఇస్తాను
ఒకటేమిటి నాతో ఎన్నొ ప్రయొజనాలు ఉన్నాయి
వినోదంలో ,విషాదంలో
విరహంలో , విఫలంలో
నన్నే కోరుకుంటారు .. అన్నిటికంటే నాలో ఉన్న సుగుణం
మద్యం తాగినోడు అబద్దం చెప్పడు అని నా గురించి అందరు గొప్పగా చెబుతుంటారు
ఎన్నో ప్రమాణాలు , ఎన్నో పరీక్షలు చేయించి కుడా నిజాన్ని శంకించే ఈ రోజుల్లో
నేను నిజాన్ని కక్కిస్తాను అనడం నా సుగుణం కాదా ..
సరే ఇవన్నీ ఎందుకూ ..
ఫ్రేమలో విఫలమైన వాళ్ళు .. పెళ్ళై సఖ్యతగా ఉండలేని వాళ్ళు
భార్య ఉండీ ప్రేయసిని మర్చిపోలేని వాళ్ళు ..
భర్తను లెక్క చేయక జల్సాగా బ్రతికే వాళ్ళు ...
ఇలా ...శారీరకంగా , మానసికంగా అలసిపోయే ఎందరికో
నేను ఉపశమనాన్ని ఇస్తాను
అసలు నువ్వేంటీ ? వీటన్నిటికి అతీతుడివా ?
అదే నిజమైతే ఏదో పోగోట్టుకోనేవాడిలా ఉండవే ..!?
నా మాట వినూ .. మద్యం తాగని వాడిని ఊత్తముడు అనరు .. అసమర్థుడంటారు
వాడి సాంగత్యాన్ని ఎక్కువమంది కోరుకోరు ...
అందుకే నా రుచి చూడూ ,,,
నేను అది విని చిద్విలాసంగా అన్నాను ...
ఎందరినో భ్రమింపచేస్తావు కదా .. నువ్వదే భ్రమలో ఉన్నవూ ..
నీకు మాత్రమే కనిపించే సుగుణాల గురించి చెప్పావు .. నీ దుర్గుణాల గురించి వింటావా ?
జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నవాడికి ,
కుటుంబాన్నే కాదు బంధుమిత్రులను ప్రేమించే వాడికి ఏ కోశనా నీ అవసరం రాదు .
భార్యను అర్థం చేసుకున్నవాడికి వాదించగలిగే అవసరమేరాదు .
నీ ప్రమేయం మితిమీరినపుడు వినోదం విషాదంగా మారిపోతుంది .
నిన్ను సేవించే వాడికి ఇంటి పేరు లాగా తాగుబోతు అని జత కలుస్తుంది .
సమాజంలోనే కాదు అతని పిల్లల దృష్టిలోనే కూడా చులకనై ఉంటాడు .
తనను దగ్గర తీసుకున్న అతన్ని ఏమనలేక భార్య శవంలా శరీరాన్ని అప్పగిస్తుంది .
ఎవరితోనైనా గట్టిగా మాట్లాడితే బాస్ రాత్రిది దిగలేదా అంటారు .
అతనెన్ని నిజాలు చెప్పిన వాడి మాటలకేం తాగి ఏదో వాగుతూ ఉంటాడు అంటారు .
నీకెన్నో దుర్గుణలున్నా ముఖ్యంగా నిన్ను సేవించే వాడి
డబ్బునే కాదు ఆరోగ్యాన్ని తినేస్తావు .. ఏదో రోజు ప్రాణాన్నే తీసుకుంటావు ....
ఏమంటావు నేను ఏదో పోగొట్టుకొనేవాడిలా ఉంటానా ?
నిజమే .. ఉంటాను.
నిన్ను సేవించి ప్రాణాలు కోల్పోయిన నా ఆప్తున్ని పోగొట్టుకున్నాను కనుక ......