ఎలా
ఉన్నావని అడిగే
ఆసక్తి నాలో లేక కాదు
ఈ హక్కు నీకేవరిచ్చారని
నువ్వడిగితే ఏం చెప్పనూ .. ?
నీతో సాన్నిహిత్యం పెంచుకోవాలనే
ఆసక్తి నాలో లేక కాదు
మధ్యలో ఉన్న అంతరాల గురించి
నువ్వడిగితే ఏం చెప్పనూ .. ?
నా అనే వారి కోసం అన్వేషించాలనే
ఆసక్తి నాలో లేక
కాదు
నేను నీ... కానా అని
నువ్వడిగితే
ఏం చెప్పనూ .. ?
మరెందుకా నిరాసక్తతని అడగాలనే
ఆసక్తి నాలో లేక
కాదు
అసలు దగ్గరగా
ఎపుడున్నామని
నువ్వడిగితే ఏం
చెప్పనూ .. ?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఇలా అన్నీ మీరే ఊహించుకుంటే ఏం చెప్పను ??? :-)
Reply Deleteనేరుగా ప్రశ్నించలేని సంకోచం ఇలా రాయిస్తుందేమో ..... కొన్నిసార్లు
Reply Delete