నా రాకకు నీ మోము
విప్పారక పోనీ
నా అడుగుల ధ్వని నీలోని
నా జ్ఞాపకాలను స్పృశిస్తే చాలు ........
నేఁ వచ్చే దారిలో
పూలు పరువాలనే అత్యాశ నాలో లేదు
నీ వీధిలోకి నేఁ వచ్చినపుడు
నువ్వు వాకిట
నిలబడితే
చాలు ......
అంత త్వరగా
వెలిసిపోయే
రంగులాంటి వ్యక్తిత్వం నీదని అనుకోను
ఎందరో నీపై ప్రభావం
చూపించి ఉన్నా
అణువంతైనా
నా స్థానం నాకు మిగిలిపెడితే చాలు ........
ఎంతో సమయం గడిచింది
అందరికీ
జ్ఞాపకం ఉంటానని ఆనుకోను
స్నేహహస్తాన్ని ఇప్పటికీ అందించడానికి
నావాళ్లలో కొందరైన మిగిలితే చాలు ........
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
నావాళ్లలో కొందరైన మిగిలితే చాలు ........ it's true. chaalaa baagundi mehdi ali gaaroo..
Reply DeleteThank You andi...
Reply Delete