Followers

Thursday, September 7, 2017

thumbnail

!! నీ అందం..... !!



నన్ను చూడకుండానే ఎన్నో కవితల్లో
నా అందాన్ని వర్ణించావు
నీ ఎదురుగా సాక్షాత్కరించాను .. 
ఇప్పుడు ఇంకెలా వర్ణిస్తావు ...తను అంది
సందిగ్దంలో పడి .. వర్ణించలేననుకుంటే
అహం అంగీకరించలేదు ....
సరే అనుకుంటే ... సమర్థత సరిపోలేదు
ఎదురుగా కనిపిస్తున్న
జాబిల్లి జాలిగా చూసింది
నా నేస్తం అందాన్ని
నీ వెన్నెలతో పోల్చి వర్ణించనా ... అడిగాను
వద్దొద్దు ... నా వెన్నెలను
అందరూ ఒకేలా ఇష్టపడరు
విరహం కలిగిస్తానని కొందరు ..
ఆహ్లాదం కలిగిస్తానని కొందరు
వాదులాడుకుంటారు ..
నీ నేస్తం అందంపై వాదనే ఉండదు
నా వెన్నెలతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
భారంగా నిట్టూర్చి మా తోటలోని పూలనడిగాను
మా అందం తాత్కాలికం ..
కొమ్మ నుండి వీడిపోతే వాడిపోతాము
నీ నేస్తం అలా కాదే .. శిశిరంలో సైతం అలాగే ఉంటుంది
మా లాలిత్యంతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
ఏకాంతంలో కూర్చోని ..
ఉప్పొంగే భావాలనడిగాను
అవి నిరాశగా అన్నాయి
భగ్నప్రేమికుడివని ..
విరహం , వేదన తప్పా ఇంకేం రాయలేవని...
నీ భావాలను ఆయిష్టా పడేవారెందరో ఉన్నారు
నీ భావాలేమంత అందంగా ఉంటాయని ..
తనతో పోల్చుతావు
నీ భావాలతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
నిరాశ పడుతుంటే నా మనసు అన్నది
అందరినీ ఎందుకింత ప్రాధేయపడ్తావు
నీ రూపం అందంగా లేకపోవచ్చు ..
నీ మానసిక సౌందర్యం చూసే తను నీ నేస్తం అయింది
నీ నేస్తం సౌందర్యానికి ఏది సాటిరాకపోయిన
తను స్నేహించే నిష్కల్మషమైన , సున్నితమైన
నీ మానసిక సౌందర్యంతో పోల్చి వర్ణించు .... .....

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

5 Comments

avatar

చూడకుండానే ఇంత అద్భుతంగా రాసారు
చూస్తే ఇంకెంత అందంగా మురిపించి మైమరపించేవారో.:)

Reply Delete
avatar

హృదయపూర్వక ధన్యవాదాలు వినోద్ ( విష్వక్సేనుడు ) గారు

Reply Delete
avatar

ఎలాగో చూడలేను .. కనీసం భావాల్లోనైనా రాసుకొని సంతృప్తి పడాలని... థాంక్స్ అండి

Reply Delete
avatar

అందంగా అభివర్ణించారు.

Reply Delete
avatar

ధన్యవాదాలు అండి

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.