ఒక వర్షపు బిందువు నీ శిరస్సు నుండి
జాలు వారి స్వగతంగా అనుకున్నది
కురుల్లో నిలిచి పోదామనుకుంటే
దట్టమైన వనం లా ఉండి
భయమేసి క్రిందికి జారాను
నుదురు ఇంత విశాలంగా ఉంది ..
ఎక్కడ ఆగాలో తెలియక క్రిందికి జారాను ..
కన్నుల్లో ఇంత ఆర్ద్రత ఉందంటే ..
అక్కడ నిలవలేకపోయాను
నాసిక సూటిగా ఉండటంతో జారిపోయా
అధరాలు పూరెమ్మల నాజూగ్గా ఉండి
తేనే లోని తీపిలా ఉంటే ఆస్వాదిస్తూ
మై మరిచి క్రిందికి జారాను ..
శంఖం లాంటి మెడ లో నిలవలేక జారీ పోయా ..
( వర్షం మరింత ఎక్కువై .. ఇంకేం ఆలోచించే అవకాశం లేక చుక్క జారీ .. పోయింది ) 😊🤣😁😊.
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments