Followers
Home
/
Archives For
March 2014
Wednesday, March 12, 2014
Sunday, March 2, 2014
** ఇంతకు మించి ఇంకేమీ కావాలి ... !? ....... **
నా రాకకు నీ మోము
విప్పారక పోనీ
నా అడుగుల ధ్వని నీలోని
నా జ్ఞాపకాలను స్పృశిస్తే చాలు ........
నేఁ వచ్చే దారిలో
పూలు పరువాలనే అత్యాశ నాలో లేదు
నీ వీధిలోకి నేఁ వచ్చినపుడు
నువ్వు వాకిట
నిలబడితే
చాలు ......
అంత త్వరగా
వెలిసిపోయే
రంగులాంటి వ్యక్తిత్వం నీదని అనుకోను
ఎందరో నీపై ప్రభావం
చూపించి ఉన్నా
అణువంతైనా
నా స్థానం నాకు మిగిలిపెడితే చాలు ........
ఎంతో సమయం గడిచింది
అందరికీ
జ్ఞాపకం ఉంటానని ఆనుకోను
స్నేహహస్తాన్ని ఇప్పటికీ అందించడానికి
నావాళ్లలో కొందరైన మిగిలితే చాలు ........
Subscribe to:
Posts (Atom)
Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.