Followers

Tuesday, January 14, 2014

thumbnail

!! బహుశ ..... !!




సంవత్సరాలైన నీలోని 
ఆహాన్ని వీడవు
బహుశ నన్ను కూడ 
వీడేదానివి కావేమో  
నీ స్నేహం కాక 
నీ అహం అయి నేఁ ఉండిఉంటే .......  



Sunday, January 12, 2014

thumbnail

!! ఏం చెప్పనూ .. ? ....!!


ఎలా ఉన్నావని అడిగే 
ఆసక్తి నాలో లేక కాదు 
ఈ హక్కు నీకేవరిచ్చారని 
నువ్వడిగితే ఏం చెప్పనూ .. ?


నీతో సాన్నిహిత్యం పెంచుకోవాలనే 
ఆసక్తి నాలో లేక కాదు 
మధ్యలో ఉన్న అంతరాల గురించి 
నువ్వడిగితే ఏం చెప్పనూ ..


నా అనే వారి కోసం అన్వేషించాలనే 
ఆసక్తి నాలో లేక కాదు 
నేను నీ... కానా అని నువ్వడిగితే 
ఏం చెప్పనూ ..


మరెందుకా నిరాసక్తతని అడగాలనే 
ఆసక్తి నాలో లేక కాదు
అసలు దగ్గరగా ఎపుడున్నామని 
నువ్వడిగితే ఏం చెప్పనూ ..





Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.