కొన్ని మాటలు నిఘూడంగా ఉండనీ...
ప్రతి విషయంపై స్పష్టతను ప్రశ్నించకు
కొన్ని భావాలను నిషిప్తంగా ఉండనీ...
మౌనంగా ఉండిపోయేలా మరీ అలా ప్రవర్తించకు
ఏదోకటి చెప్పగలిగే సాన్నిహిత్యాన్ని స్వరంలో ఉండనీ...
నువ్వు చెప్పేదే వేదమనేలా భావాలను రాయకు
నీ కొన్ని భావాలపై కొన్ని విమర్శలు ఉండనీ...
తిరిగి రానిది సమయం ఒక్కటే అనుకోకు
స్నేహం .. అనే భావాన్ని కూడ నీ మనసులో ఉండనీ ...