Followers

Thursday, May 8, 2014

thumbnail

!! ఎన్నాళయింది నాన్న? ... !!


ఎన్నాళయింది నాన్న 
నాతో మనస్ఫూర్తిగా మాట్లాడక ...
నిజానికి నువ్వేం మాట్లాడుతావని ...

నా దగ్గరికి నువ్వు రావు 
నీ ప్రపంచం లోకి నేనొస్తె 
ఏరా బాగ చదువుతున్నావా ..తప్పా
నువ్వేం మాట్లాడుతావని ...

ఉదయం లేచినప్పటి నుండి 
రాత్రి .. అది కూడ ఏ రాత్రి నిద్రపోతావో  .....
ఇంటర్ నెట్టే  నీ ప్రపంచం 

ఉదయం రాత్రి మధ్యలో  
నువ్వు ఆఫీస్ కు వెళ్లిపోతావు
నెను స్కూల్ కు వెళ్లిపోతాను  
అమ్మ , నువ్వు నేను కలసిఉండే 
కొద్ది సమయం నీదేమో నీ ప్రపంచం
నిన్ను ఏమనలేక అమ్మాదో టీవీ ప్రపంచం
మీ ఇద్దరికి చెప్పలేని 
నా చిన్ని ప్రాయానిదో ఫ్రపంచం 

మనందరి మధ్యలొ కొన్ని 
యాంత్రిక పలుకరింపులు 
మనం అపరిచితులమా నాన్నా

ఇంతకు ముందు ఏలా ఉండే వాళ్ళం !?
ఉదయాన్నే నాకు అన్నీ బొధించే వాడివి 
చదువులో అవి నన్ను ముందుకు నడిపించేవి

సాయింత్రాలు నన్ను తీసుకొని షికార్లకు వెళ్ళేవాడివి
నన్ను తీసుకెళ్ళడం కాదు ... నువ్వే కంప్యూటర్ వదలవు 
ఇంటికి బంధువులు వస్తే ముళ్ళపై కూర్చున్నట్టూ ప్రవర్తిస్తావు
వాళ్ళెప్పుడు వెళ్ళిపొతారాని చుస్తావు 

ఇదేనా నాన్న జీవితం ? ఇదేనా నీ ప్రపంచము ?
నీ పరిజ్ఞానం పెంచుకో ..
మాక్కాస్తా సమయం ఇచ్చి  
మాతో కూడా కాస్త ప్రేమను పంచుకో

నీకు చెప్పే ప్రాయం నాది కాకపోవచ్చు
నెట్ పై చెతులతో ప్రపంచాన్ని 
ముందుకు తెచ్చుకుంటావే  
ఆవే చేతులతో అప్పుడప్పుడు 
నా శిరస్సు ను కూడ నిమురు నాన్న..


Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.